గోల్డెన్ న్యూస్/ న్యూఢిల్లీ : లోక్‌సభలోకి వక్ఫ్ సవరణ బిల్లును నేడు ప్రవేశపెట్టను న్నారు.. ఈ బిల్లులో 14 నిబంధనల్లో.. 25 సవరణ లు చేశారు. మొత్తం 655 పేజీల బిల్లు ఉంది. దీన్ని జనవరి 30న లోక్‌సభ స్వీకర్‌కి జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఇచ్చారు.
అందువల్ల ఇవాళ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు.ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది.
ఈ జేపీసీలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. అంటే.. ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు కూడా అనుకూలంగా ఉన్న ట్లే అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి జేపీసీలో.. ప్రతిపక్ష నేతలు.. 44 మార్పులను సూచించారు.
వాటిని జేపీసీ ఛైర్మన్ ఒప్పుకోలేదు. అదే సమయంలో.. ఎన్టీయే పక్షాల సభ్యులు ప్రతిపా దించిన 14 సవరణలకు మాత్రం జేపీసీ ఆమోదం తెలిపింది. వీటికి ఎన్డీయే లోని 16 మంది సభ్యులు ఆమోదం తెలపగా..
విపక్షాలకు చెందిన 10 మంది ఎంపీలు వ్యతిరేకిం చారు. అందువల్ల ఈ బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు.. రచ్చ రేగే అవకాశాలు ఉన్నాయి.
Post Views: 40