కుల గణన సర్వే తెలంగాణకు రోల్ మోడల్ గా నిలుస్తుంది సీఎం

తెలంగాణలో కులగణన సర్వే విజయవంతంగా ముగిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్వే దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించామని, సేకరించిన వివరాలు సమగ్రంగా ఉన్నాయని చెప్పారు. ఈ సర్వేలో బీసీలు 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లిం మైనారిటీలు 10.08% జనాభా ఉన్నట్లు వెల్లడించారు.

సర్వే పారదర్శకంగా జరిగిందని ఎలాంటి పొరపాటు లేదని, విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వేకు ముందు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, లోటుపాట్లను సరి చేశామని తెలిపారు.

ఈ కులగణన సర్వే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదం చేస్తుందని, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఈ డేటా ఆధారంగా రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram