ఎంపీడీవోను కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు

గోల్డెన్ న్యూస్/పినపాక : ఇటీవల పినపాక ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ ను పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కు మొక్కను అందజేశారు.  ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన మండల పరిధిలోని  సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రెస్ క్లబ్ సభ్యులకు సూచించారు . ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిట్ట వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు యాకన్నా, ప్రధాన కార్యదర్శి గుడికందుల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram