అవగాహనే ఆయుధం… క్షయ వ్యాధి దూరం

క్షయ వ్యాధిని అంతం చేయడమే భారతదేశం లక్ష్యం పెట్టుకుంది – వైద్యాధికారి రవితేజ

గోల్డెన్ న్యూస్/ కరకగూడె : భారతదేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ముమ్మర కృషి కార్యక్రమం నిక్షయ్ షివిర్ లో భాగంగా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ డా.రవి తేజ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ మోతే ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని వెంకటపురం గ్రామాల ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన, అనుమానితుల గుర్తింపు జరిగింది.దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన క్షయ వ్యాధి తీవ్రంగా ఉన్న 347 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి అని కాబట్టి క్షయ వ్యాధిపై సమాజంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుని అవగాహన పెంచుకొని దానిని పూర్తిగా నిర్మూలించడంలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు లేనిచో క్షయ వ్యాధి బారిన పడి మరణం పొందిన జాబితాలో మనతోపాటు మన కుటుంబ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వ్యాధి లక్షణాలు అయినా 15 రోజులకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం, ఆయాసం, అలసట, తేమడా లో రక్తం పడటం , మెడ చుట్టూ, సంకలో, గజ్జ లో గడ్డలు వంటి ప్రధాన లక్షణాలు ఉన్నవారు గతంలో క్షయ వ్యాధికి మందుల వాడిన వారు మరియు వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ వందరోజుల నిక్షయ్ షివిర్ కార్యక్రమంలో పాల్గొని ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నిర్ధారణ జరిగితే ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన మందులతో వ్యాధిని తగ్గించుకొని తద్వారా మరణాన్ని నివారించుకోవడంతోపాటు కుటుంబ సభ్యులకు మరియు సమాజంలోని ఇతరులకు క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని తద్వారా ఈ వ్యాప్తిని భారత సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని అన్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధికి మందులు వాడే ప్రతి వ్యాధిగ్రస్తుడికి వ్యాధి తగ్గేవరకు నిరంతర సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు పోషకాహార నిమిత్తం మందులు వాడే కాలానికి ప్రతి నెల రూ.1000 ఎకౌంట్ లో వేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీబీ అలెర్ట్ ఇండియా డిస్ట్రిక్ కోర్డినేటట్ ,వెంకటేశ్వర్లు గారు, ఎక్సరే టెక్నీషియన్ లహరి ,స్టాఫ్ పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram