ఎఫ్ డి ఓ రామకృష్ణ
గోల్డెన్ న్యూస్/ రాజంపేట్ : అటవీ భూములను కబ్జా చేసిన,అటవీ శాఖ అధికారులపై దాడులు చేసిన శాఖాపరమైన చర్యలు తప్పవని ఎఫ్డిఓ రామకృష్ణ హెచ్చరించారు. గత కొన్ని రోజుల క్రితం రాజంపేట్ మండలంలోని షేర్శ కర్ తండా గ్రామంలోని కొందరు వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతంలో బోరు వేసి, చదును చేయడంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకోగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ఫారెస్ట్ అధికారులపై దాడులు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులు, పోలీస్ బలగాల మధ్య షేర్ శంకర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా, అటవీ ప్రాంతాన్ని కబ్జా చేయకుండా జెసిబిల సహాయంతో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కందకాలు తీశారు. ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్. యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, ఎఫ్ ఆర్ వో రమేష్, సంతోష, ఓంకార్, వాసుదేవ్, ఎఫ్ ఎస్ ఓ సయ్యద్ బాబా, బీట్ ఆఫీసర్లు, భారీ పోలీసు లు, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.రాజంపేట మండలం షేర్ శంకర్ తండా, జోగురాంబ తండా శివారులో అటవీ భూమి వివాదం నెలకొంది. తండావాసులు అటవీ భూమిని కబ్జా చేస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పోలీసుల సాయంతో సుమారు 100 మంది ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. అటవీ భూమి చుట్టూ కందకం తవ్వడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తండావాసులు, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే గత ప్రభుత్వాలు ఆర్వోఎస్ఆర్ పట్టాలు ఇచ్చిన భూముల్లోనే తాము పంటలు వేసుకుని కబ్జాలో ఉన్నామని తండా వాసులు చెబుతున్నారు. స్థానిక సెక్షన్ ఆఫీసర్ బాబా తమను డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే ట్రెంచ్ కొడుతున్నారని ఆరోపించారు. తమపై అటవీశాఖ అధికారులు కేసులు కూడా పెట్టారన్నారు. ఈ విషయమై ఎఫ్ వో రామకృష్ణను వివరణ కోరగా తాము పట్టాలు ఇచ్చిన భూముల జోలికి వెళ్లడం లేదన్నారు. సుమారు 60 నుంచి 70 ఎకరాల అటవీ భూమి పలు దఫాలుగా కబ్జా చేయడానికి చెట్లు కొడుతున్నారన్న సమాచారంతో గ్రామానికి వెళ్లామన్నారు. కంపార్ట్మెంట్ 677 పరిధిలో ఒక్క ఎకరం కూడా పట్టా ఇవ్వలేదన్నారు. అటవీ భూమిని కాపాడాలనే ట్రెంచ్ కొడుతున్నామని స్పష్టం చేశారు. పంట వేసిన భూమి జోలికి వెళ్లడం లేదని, పంట కోత అనంతరం అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వారం క్రితం తమ సిబ్బంది ఇక్కడికి వస్తే దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడి చేసిన పై కేసులు నమోదు చేశామన్నారు.