అభాగ్యులకు అండగా కిరణ్.

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు చేస్తూ సేవలు అందిస్తున్నారు జర్నలిస్ట్‌ గండికోట కిరణ్‌ కుమార్‌. కొత్తగూడెంలో గత కొన్ని నెలలుగా కాళ్ల ఇన్ఫెక్షన్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఫుట్‌ పాత్‌ మీద జీవనం సాగిస్తున్న వృద్ధుడు బాబూరావు దుర్భర స్థితిని గమనించిన కిరణ్‌ గత నెలలో ఉచిత వైద్య సేవలు అందించి స్వయంగా తన డబ్బుతో రెండు నెలలకు సరిపడా ఖరీదైన మందులు ఇప్పించాడు. కాళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకిన బాబూరావును కిరణ్‌ స్వయంగా ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి దగ్గరుండి ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడంలో సహాయ పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసి పలకరిస్తే ఎక్కడ సహాయం అడుగుతారేమో అని బందు మిత్రులు, పరిచయస్తులే మొహం చేటేస్తున్న నేటి రోజుల్లో తనకేమీ కాకపోయినా అభాగ్యులకు నేను సైతం అంటూ తన వంతుగా సేవచేస్తూ ఔదార్యాన్ని చూపిస్తున్నాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram