నల్గొండ జిల్లా అనపర్తి ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన జిల్లా పోలీసు సిబ్బంది.
హాజరై ఫైరింగ్ చేసిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు, అదనపు ఎస్పి లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, జిల్లాలో ఉన్న DSP లు, ఇన్స్పెక్టర్ లు, SI, పోలీసు సిబ్బంది.
ప్రతి సంవత్సరం నిర్వహించే పోలీసు వార్షిక మోబిలైజేశన్ లో భాగంగా జిల్లా పోలీసు సిబ్బందికి ఆయుధ పరిజ్ఞానం, ఫైరింగ్ నిర్వహణపై శిక్షణ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అర్ముడ్ రిజర్వు అదికారుల పర్యవేక్షణలో నల్గొండ జిల్లా అన్నేపర్తి బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ నందు సూర్యాపేట జిల్లా పోలీసులకు ఫైరింగ్ నిర్వహించారు. ఈరోజు జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు, అధనపు ఎస్పి లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, DSP లు హాజరై ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగినది. జిల్లాలో ఉన్న 500 మంది పోలీసు సిబ్బంది ఈ ఫైరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. ఎస్పి గారు మాట్లాడుతూ పోలీసు విధుల నిర్వహణలో, శాంతి భద్రతల రక్షణలో సాంకేతికత తోపాటు ఆయుధ పరిజ్ఞానం అవసరం ఉంటుంది అని తెలిపినారు, పోలీసు సిబ్బంది అందరూ ఫైరింగ్ చేయాలని తెలిపినారు. దీనిలో భాగంగానే సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాం అని తెలిపినారు. AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, DSP నరసింహ చారి, AR అడ్మిన్ ఇన్స్పెక్టర్ నారాయణ రాజు ఫైరింగ్ ప్రాక్టీస్ ను పర్యవేక్షణ చేశారు. RSI లు సురేష్, రాజశేఖర్, సాయిరాం లు ఫైరింగ్ రేంజ్ నందు విధులు నిర్వర్తించారు.