ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ జితేష్ వి పాటిల్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హాజరయ్యారు.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 9 వరకు జరగనున్న సుధాకర్ రెడ్డి మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, నాగా సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఇంటరనేషనల్ బ్యాట్మింటన్ కోచ్ స్వర్గీయ గుజ్జుల సుధాకర్ రెడ్డి మోమోరియల్ పేరిట వరుసగా రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీలు నిర్వహిస్తున్న సావిత్రి సుధాకర్ రెడ్డి గారిని అభినందించారు.
Post Views: 23