స్థానిక సంస్థల వార్ షురూ.?

3 విడుత‌ల్లో స‌ర్పంచ్ ఎన్నికలు! 10న నోటిఫికేషన్‌

గోల్డెన్ న్యూస్/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో మ‌రో అస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ‌హించేందుకు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ రెడీ అయింది. ఈ క్ర‌మంలో 10-02-2025న నోటిఫికేషన్ విడుదల కానుంది. మూడు విడుత‌ల్లో 24 -02 -2025మొదటి విడత ఎన్నికలు, 03-03-2025 రెండవ విడత ఎన్నికలు, 10-03-2025న‌ మూడో విడత ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి.ఈనేప‌థ్యంలో ఎన్నిక నిమిత్తం సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram