గోల్డెన్ న్యూస్/డిల్లీ : డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకనేతలకు షాక్ ఇచ్చాయి. ఆప్ జాతీయ కన్వీనర్ కేజీవాల్ న్యూడిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. అలాగే జంగ్ పుర నియోజక వర్గం నుంచి మనీష్ సిసోదియా ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. కాల్ కాజీ స్థానం నుంచి డిల్లీ సీఎం అతిశీ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళుతుంది. ఈనేపథ్యంలో కేజీవాల్ ఓటమితో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Post Views: 26