– కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయింది
– రాబోయే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పినపాక నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. శనివారం కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన 7 పంచాయితిల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని. హామీలు నిర్వర్తించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిి కార్యకర్త సైనికుడులా పనిచేసే బిఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చా..