మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన తనయుడు

మద్యం మత్తులో ఓ యువకుడు తండ్రి కిరాతకంగా హతమార్చాడు.  ఏకంగా రంపంతో కోసి చంపిన ఘటన ఏపీలో కలకలం రేపింది.ఈ ఘటన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామంలో ఆదివారం ఆలస్యంగా చోటు చేసుకుంది.

ఎస్సీ కాలనీలో ఉంటున్న పైడిపోగు యేసయ్య (64) ను  అతడి కొడుకు మరియ దాసు హత్య చేశాడు. నిద్రలో ఉన్న తండ్రిని చంపి..అనంతరం రంపంతో కోశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ యువకుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram