- దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయిన బాలుడు
గోల్డెన్ న్యూస్/యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆరెగూడెం గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి మద్యం మత్తులో తన కుమారుడిని కొట్టడంతో బాలుడు మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న బాలుడు శనివారం తమ పాఠశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్ పార్టీకి వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మద్యం మత్తులో సైదులు విద్యార్థిని చితకబాదాడు. దెబ్బలు తట్టుకోలేక బాలుడు ఆ కోల్పోయాడు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం లేకుండా ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు సైదులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
Post Views: 23