టి యు సి ఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి.

టి యు సి ఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి.- టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి,

 గోల్డెన్ న్యూస్ /పినపాక ఈ నెల 16న కొత్తగూడెంలో జరిగే టి యు సి ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. సోమవారం పినపాక మండలం లో వివిధ గ్రామపంచాయతీల వర్కర్స్ ,కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ తో గ్రూప్ మీటింగ్స్, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు ఓకే రకమైన పని చేస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 వేతనాలు చెల్లిస్తూ, గ్రామపంచాయతీ కార్మికులకు 9,500 రూపాయలు చెల్లించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ప్రతినెల వేతనాలు చెల్లించాలన్నారు. వారికి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. కేజీబీవీ నాట్ టీచింగ్ వర్కర్స్ కు కూడా పనికి తగ్గ వేతనాలు అందడం లేదన్నారు. కేజీబీవీ నాట్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే టియుసిఐ జిల్లా మహాసభ ను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వెంకన్న, శ్రీను, మౌనిక ,లాలయ్య ,నరసయ్య, రామారావు, సుజాత ,విజయలక్ష్మి ,నాగమణి ,చిట్టెమ్మ, రమణ, నవిత, సునీత, బాలరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram