బట్టుపల్లి స్కూల్ కాంప్లెక్స్ బాలమేళ ప్రారంభం

బాలమేళ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభకు వేదిక      ప్రధానోపాధ్యాయులు మోహన్ బాబు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :   భట్టుపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  మోహన్ బాబు కరకగూడెం మండల విద్యాశాఖ అధికారిణి ఎ మంజుల  ఆధ్వర్యంలో సోమవారం FLN బాలమేళ కార్యక్రమం నీర్వ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12 ప్రాథమిక పాఠశాలల నుండి 120 విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులతో ఉన్న సామర్థ్యాలను వెలికితిసే విధంగా వివిధ రకాల కార్యక్రమాలను విద్యార్థుల చేత నిర్వహించారు . మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు బట్టుపల్లి ప్రధాన ఉపాధ్యాయులు టి మోహన్ బాబు అందజేశారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అక్షరాస్యత, గణిత పునాది కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అంశాలను ప్రదర్శించేందుకు బాలమేళ ప్రాముఖ్యత కలిగిన వేదికగా నిలుస్తుందని అన్నారు.

విద్యార్థులు తమ గణిత, భాషా నైపుణ్యాలను సమూహంగా ప్రదర్శించేందుకు, సృజనాత్మకతను అభివృద్ధి చేసేందుకు ఈ బాలమేళ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది విద్యార్థులకు ఆటవిడుపుతో పాటు, వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే అవకాశం కూడా అని తెలిపారు.

కాంప్లెక్స్ పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన టీఎల్ఎమ్ టిచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ను పరిశీలించి, అభినందనలు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాంప్లెక్స్ స్థాయిలో జరిగే బాలమేళకు ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram