శవానికి రెండు రోజులు వైద్యం

విచారణకు ఆదేశించిన ఆరోగ్య శాఖ మంత్రి.

హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.

మినిస్టర్ ఆదేశాలో ఫిబ్రవరి 10న ఆరోగ్యశాఖ అధికారులు మియాపూర్ లోని సిద్దార్థ్ హాస్పిటల్ కు వచ్చారు. హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. అయితే సిద్దార్థ్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు.

కడప జిల్లాకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్దార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బులుకట్టలేని పరిస్థి రావడంతో నిమ్స్ కు వెళ్లాలని చెప్పారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు. నిమ్స్ కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం సుహాసిని కుటుంబ సభ్యులు సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా వైద్యం పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram