పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..RMPలకు అండగా ఉంటాం హరీష్‌ రావు

రాష్ట్రంలో ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్‌ఎంపీలపై అక్రమ కేసులు పెట్టకుండా.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఆర్‌ఎంపీలకు ఇచ్చిన హామీను నెరవేర్చాలన్నారు.

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా వారి కళ్లల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని.. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన్రు.. రాహుల్ గాంధీని తీసుకు వచ్చి హామిలిప్పించారన్నారు. సోనియా గాంధీతో లెటర్లు రాయించారని.. ఇప్పుడు హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 11 సార్లు ఢిల్లీ పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పోతున్నడు వస్తున్నడు కానీ.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకడం  లేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎవరు వచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తడు అంటడు 15 నెలలు గడిచిన ఎవర్నీ కల్వలేదు కొడంగల్ వాళ్లను కూడా రానివ్వని పరిస్థితి  మీ సత్తా చూపే సమయం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కలసి ఉండాలి. విడిపోయి ఉండొద్దు. అప్పుడే మీకు బలం ఉంటది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణం కట్టుకోవాలి రేవంత్ రెడ్డి గాల్లో ఉన్నడు. గాలి మోటర్లు, విమానాల్లో తిరుగుతున్నడు. ప్రజాస్వామ్యంలో ఓటే బలం. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి ఇప్పటికే అరెస్టు చేసిన వారి మీద వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం . ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటదని ఓట్లప్పుడు మాటలు చెప్పిండు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నడు అడిగితే ఉల్టా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నడు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి, ప్రశ్నిస్తా నిలదీస్తా. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప అని ఆయన అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram