గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో నేటి నుంచి జరగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. డీఎస్పీ ట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని జాతర కమిటీ నిర్వాహకులకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు సమస్యలు ఎదురైతే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు .మంగళవారం కుంకుమ పూజతో పాటు మండవెలుగుడు కార్యక్రమంలో ప్రారంభమయ్యింది. ఈ నెల 15 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో డిఎస్పీ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ,కరకగూడెం ఎస్సై రాజేందర్. ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
