యువకుడిపై పోక్సో కేసు నమోదు

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగొండ మండలానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను  రావికంపాడుకు చెందిన వినోద్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి పలు మార్లు అత్యాచారం చేశాడు.  బాలిక పెళ్లి మాట ఎత్తడంతో చేసుకోనని బెదిరించాడు. మోసపోయానని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదైనట్లు ఏఎస్ఐ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram