ఎస్సీ వర్గీకరణ లో నేతకానిల కు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలి.!

గ్రూపులో ఉండాలననే స్వేచ్ఛ ఆయా కులాలకే ఇవ్వాలి. దుర్గం ప్రేమ్ కుమార్

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ఎస్సీ వర్గీకరణ లో నేతకాని ల కు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం లో నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఇటీవలే ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ శమీమ్ అక్తర్ ఇచ్చిన రిపోర్ట్ లో  నేతకాని కులస్తులను మాల సామాజిక వర్గం వున్న అత్యధిక అభివృది చెందిన కులాల జాబితాలో గ్రూప్ 3 లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేతకాని సామాజిక వర్గం ను మాల కులాలకు సంబంధం లేకుండా నేతకాని మరికొన్ని వెనుకబడిన కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని పత్రికల ద్వారా విన్నవించుకుంటున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు . ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్,ములుగు జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బాడిశ సువాష్, భద్రాద్రి జిల్లా యూత్ లీడర్ గోగు సాయి,జాడి దినేష్ జాడి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram