♦ గంటలపాటు కారులోనే బందీలుగా వధూవరులుబంధువర్గమంతా కకావికలు.
♦ చిరుత పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు.
లక్నో: ‘హమ్ తుమ్ ఏక్ కమ్ మె బంద్ హో.. ఔర్ రాత్ హో జాయె..’ అంటూ సాగే పాపులర్ హిందీ సినిమా బాబీలోని పాటను కాస్త అటూ ఇటూగా మార్చి ‘హమ్ తుమ్ ఏక్ గాడీ మే బం ద్ హో.. ఔర్ షేర్ ఆ జాయె..’ అంటూ పాడుకునే సందర్భమిది. పెళ్లి వేడుకలో అందరూ బిజిబి జీగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచో హఠా త్తుగా ఓ చిరుతపులి ఫంక్షన్ హాల్లోకి ప్రవేశిం చింది. దీంతో, జనం హతాశులై ఎక్కడి వారక్క డే పరుగులు తీశారు. వరుడు, వధువు ఓ వాహ నంలో డోర్లు బిగించుక్కూర్చున్నారు. దాదాపు గంటన్నరపాటు ఆ చిరుత అక్కడే తిరు గాడింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి ముకద్దర్ అలీ చిరుతను బంధించేందుకు
యత్నించగా ఆయన చేతిని గాయపరిచింది. దీంతో, మిగతా సిబ్బంది వెనక్కి తగ్గారు. ఎట్ట కేలకు మత్తు మందు ప్రయోగించి అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో చిరుతను బం ధించారు. ఆ తర్వాతే పెళ్లి వేడుకను ముగిం చారు. ఈ ఘటన బుధవారం రాత్రి లక్నోలోని బుధేశ్వర్ రోడ్డు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఆ చిరుత జనసమ్మర్దం ఉండే ప్రాంతంలోకి, అం దునా భవనంలోకి ఎలా ప్రవేశించింది? అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా చెప్పారు. సుమారు 90 కిలోల బరువున్న ఆ చిరుతను అటవీ ప్రాంతంలో వదిలేస్తామన్నారు.