ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ.. వాతలు వచ్చేలా కొట్టిన వైనం, సీఐ తీరుపై తీవ్ర విమర్శలు

గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ : ఎడపల్లి మండలం జానంపేట్ గ్రామ శివారులో  లక్ష్మీనరసం హస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో  గురువారం నిర్వహించిన చక్రతీర్థం లో బోధన్ రూరల్ సీఐ తనను లారీతో కొట్టారని రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయి బాగ్య అనే మహిళ ఆరోపించింది.

బ్రహ్మోత్సవాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం తన కుమారునికి ఆట వస్తువులను కొనేందుకు వెళ్తగా  తన పర్స్ కనిపించకపోవడంతో,  అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన పర్సులో ఆధార్ కార్డు తో పాటు మూడు వందల రూపాయలు, ఇంటి కాళం చెవి ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. పోలీసులు మహిళ వెంట వెళ్లి అక్కడే ఉన్న దుకాణ సముదాయాల వర్తకుల వద్ద పర్చు తాలూకు సమాచారాన్ని సేకరించే యత్నం చేశారు. అప్పుడే అటుగా వస్తున్న బోధన రూరల్ సిఐని సైతం మహిళ కలిసి తన గోడును. వెళ్ళబోసుకోగా స్పందించిన సీఐ మహిళకు సహాయం అందించాలని పోలీసులను ఆదేశించినట్లుగా మహిళ పేర్కొంది. ఎంతకీ తాను పోగొట్టుకున్న పర్స్ జరగకపోవడంతో ఆలయ సమీపంలో తాను రోధిస్తున్న కూర్చుంది. ఆ సమయంలో అటుగా వచ్చిన సిఐ  తన చేతిలో ఉన్న లాఠీ తో బలంగా కొట్టారని, తొడ భాగంతో పాటు పిరుదుల భాగంలో బలంగా లాఠీ దెబ్బ తలడం తీవ్రమైన నొప్పితో  ఏడ్చుకుంటూ తన స్వగ్రామం వెళ్ళింది , జరిగిన సంఘటనను తన కుటుంబ సభ్యులకు వివరించి ఈ విషయంపై శుక్రవారం ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని భాదిత మహిళ తెలిపింది. మహిళలనే కనికరం లేకుండా తనపై దుర్భాషలాడుతూ తనపై లాఠీ ప్రయోగించిన బోధన్ రూరల్ సీఐపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఎడపల్లి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అందరి ముందు తనపై సి.ఐ దాడికి దిగడం తనకు తీవ్ర మనస్తాపం కలిగించిందని తనను విచక్షణ రహితంగా సీఐ కొట్టారని ఆరోపించింది.ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేసింది.ర్యాదును  స్వీకరించిన ఎస్సై ఎడపల్లి వంశీకృష్ణారెడ్డి పోలీసులు ఎవరు ఆ మహిళను లాఠీ తో కొట్టలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం జరగకపోతే నిజామాబాద్ సి.పి కి సైతం పిర్యాదు చేస్తానని బాధిత మహిళ తెలిపింది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram