ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

 ఎడ్ల బండిపై వచ్చి అలరించిన జిల్లా కలెక్టర్.

లక్ష్మీదేవి పల్లిలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని శనివారం ఘనంగా జరుపుకున్నారు.

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఓ మామిడితోటలో శనివారం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను వైద్యశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల బండిపై డీసీహెచ్ఎస్ రవిబాబు వైద్య సిబ్బందితో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. బంజారా ప్రజలకు సంత్ సేవాలాల్ చేసిన కృషిని గురించి కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా సేవలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు  నిర్వహించారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram