ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా? లిస్టులో మీ పేరు ఉందా?

మీ పేరు లిస్టులో ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద మీకు ఇల్లు మంజూరైందో లేదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇలా చెక్ చేయండి:

1. అధికారిక వెబ్‌సైట్‌ (https://indirammaindlu.telangana.gov.in/applicantSearch) కు వెళ్లండి.

2. మీ వివరాలు నమోదు చేయండి – ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయండి.

3. ‘Go’ బటన్‌పై క్లిక్ చేయండి.

4. మీ దరఖాస్తు స్థితిని చెక్ చేయండి – ఇల్లు మంజూరైందా? ఏ దశలో ఉంది? అన్న వివరాలు ప్రదర్శించబడతాయి.

5.మీ దరఖాస్తు స్థితిని చూడండి: ఇప్పుడు, మీ దరఖాస్తు స్థితి, ఏ జాబితాలో (L1, L2, L3) ఉంది, తదితర వివరాలు ప్రదర్శించబడతాయి.

ప్రభుత్వం ఈ పథకాన్ని ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఉచిత గృహాలను అందిస్తోంది. మీరు కూడా మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో వెంటనే తెలుసుకోండి!

Facebook
WhatsApp
Twitter
Telegram