గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారైన నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రిడ్జి సెంటర్ చెక్‌పోస్టు వద్ద సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా, ఒక బైక్‌పై గంజాయిని తరలిస్తున్న నిందితులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో బైక్‌పై ఉన్న నిందితులు పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా బైక్‌ను వేగంగా ముందుకు పోనిచ్చారు. పోలీసు వారిని ఆపే ప్రయత్నం చేస్తుండగా, నిందితులు ఆయనను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసు స్వల్పంగా , నిందితులు అదృశ్యమయ్యారు.
పోలీసులు వెంటనే అప్రమత్తమై పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తూ, నిందితుల వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు పోలీసు అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
Post Views: 50