తాటిపల్లి రెసిడెన్సీ లో మంటలు
గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం : పట్టణంలోని హోటల్ తాటిపల్లి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం సంభవించింది. బిల్డింగ్ లోని మూడో ఫ్లోర్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు సమాచారం. లాడ్జి గదులలో ఉన్న వారు భయంతో హోటల్ బయటకు పరుగులు పెట్టారు. పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో లాడ్జిలో గదులు బుకింగ్ అయి ఉన్నాయి. అగ్నిప్రమాద సంభవించడంతో జనాలు హోటల్ లో నుంచి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Post Views: 22