దేశ రాజధానిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 5.36 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. భయబ్రాంతులకు లోనైన ప్రజలు రోడ్లపైకి కోరుకున్నారు. భూకంప కేంద్రం ఎక్కడ, తీవ్రత ఎంత నమోదైందో తెలుసుకుందాం. భూకంపం కేంద్రం ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటంతో మరోసారి భూమి కంపించే అవకాశముందని తెలుస్తోంది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇళ్లు, ఇంట్లోని వస్తువులు కంపిస్తుండటంతో భయపడిన ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం కూడా ఢిల్లీకు సమీపంలోనే 5 కిలోమీటర్ల లోతులో ఉండటం గమనార్హం. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదు. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.