లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ అధికారులు

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు కొమరారం లో అటవీ శాఖ  రేంజ్ కార్యాలయంలో అధికారులు ఉదయ్ కుమార్, ఎఫ్.బి.ఓ హరిలాల్ ను ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు… ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని కొమరారం ఫారెస్ట్ రేంజ ర్ ఉదయ్ కిరణ్, ఫారెస్ట్ గార్డ్ (చౌకిదార్) నూనావత్ హరిలాల్ ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 30 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ తన సిబ్బందితో దాడి చేసి పట్లుకున్నారు. అటవీ భూమి నుంచి మట్టి తవ్వుకునేందుకు ఓ వ్యక్తి నుంచి ఈ ఇద్దరు అటవీ అధికారులు ఆయా మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి తమ వలకు పట్టుబడినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram