గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తన ప్రాణాలు పణం గా పెట్టి.. విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ఎస్ ఆర్ డిజి పాఠశాల బస్ క్లీనర్ శ్రీనివాస్ మృతి చెందిన పట్టించుకోని యాజమాన్యం. వివరాల్లోకి వెళితే కొత్త గూడెం పట్టణ సి ఇ ఆర్ క్లబ్ వద్ద నివసించే దేశాబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్తగూడెం లోనీ ఎస్ ఆర్ డిజి స్కూల్లో గత 4 సంవత్సరాలనుండి స్కూల్ బస్సు క్లీనర్ గా పనిచేస్తున్నారు ఈ నెల 13 వ తేది సాయంత్రం విద్యార్థులని ఇంటి వద్ద దింపుతున్న క్రమం లో పడమటి నర్సాపురం దగ్గర ఒక టాటా ఎస్ వాహనం రాంగ్ రూట్ లో వచ్చి డీ కొట్టడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఓ ప్రయివేట్ ఆస్పత్రి తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందారు.. ఇంత జరిగినా తమ వద్ద పని చేసే ఉద్యోగి మరణించిన కూడా యాజమాన్యం పట్టించుకోవడం పక్కన పెడితే ఎలాంటి స్పందన లేకపోవడం తో.. స్కూల్ ప్రిన్సిపాల్ తిరుమల రెడ్డి , యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి తమ కుటుంబానికి తగిన న్యాయం చెయ్యాలి అని మృతుడి కుమార్తె. కుమారి యమున డిమాండ్ చేస్తున్నారు.
