గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన జాతీయ వార్షిక పద్దులు గందరగోళంగా, కార్పొరేట్ పెత్తందారులకు అనుకూలంగా ఉందని దాన్ని వెంటనే సవరించాలని సిపిఎం, సిపిఐ పార్టీల మండల కార్యదర్శిలు కొమరం కాంతారావు, వంగరి సతీష్ లుఅన్నారు.
ఈ సందర్భంగా బుధవారం కరకగూడెం మండల కేంద్రంలో జరిగిన అఖిలపక్షాల నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సామాన్యులు, రైతులు, కార్మికులు, కర్షకులకు వ్యతిరేకంగా బడ్జెట్ను రూపొందించారని మండిపడ్డారు.
దేశంలో 200 మంది శత కోటీశ్వరులపై 4% సంపద పన్ను ప్రవేశపెట్టాలని,
కార్పోరేట్ పన్ను పెంచాలి చెప్పారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత్తు ధరకు హామీ కల్పించాలని,భీమా రంగంలో 100% ఎఫ్డిఐ ఉపసంహరించాలన్నారు.
ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించటం దేశానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామి పధకం 50% నిధులు కేటాయింపులు పెంచి పట్టణాలకు కూడా వర్తింప చేయాలని, ఆరోగ్య, విద్యారంగాలకు జిడిపిలో 3% చొప్పున కేటాయించాలనీ,ప్రజాపంపిణీ వ్యవస్ధను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలన్నారు.
ఎస్సి, ఎస్టి రంగాలకు, మహిళా, శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని,
స్కీం వర్కర్ల గౌరవ వేతనంలో కేంద్రం వాటాను పెంచాలని
, రాష్ట్రాలకు నిధులు పెంచాలని,పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు, సర్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మార్పులు తీసుకొచ్చి నూతన పద్దులను ప్రవేశపెట్టాలని, లేదంటే వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కోవాసి వెంకట్, సిపిఐ మండల సమితి సభ్యులు బుడగం సతీష్ తదితరులు పాల్గొన్నారు..