గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: రాష్ట్రంలో 34 నుంచి 37 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు,18 నుంచి 22 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. గాలిలో అనిశ్చితి కారణంగా రానున్న రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Post Views: 34