వృద్ధ దంపతులపై దాడి 70 తులాల బంగారం చోరీ

గోల్డ్ న్యూస్/ కరీంనగర్ :  హుజురాబాద్ లో భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి మూడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తి మెడపై పెట్టి బెదిరించారు. టవల్తో నోరు, కాళ్లు కట్టేసి దాడి చేస్తూ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని రాఘవరెడ్డి, అతని భార్యపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.బాధితుల చరవాణిలను తీసుకెళ్లి బయటపడేశారు. విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రలు, నిపుణులు, డ్వాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Facebook
WhatsApp
Twitter
Telegram