గోల్డెన్ న్యూస్/ గోదావరిఖని : యైటింక్లెయిన్ కాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరచిపోయిందని ఇలాంటి క్రమంలో మళ్లీ నమ్మి గెలిపిస్తే ఇలా హామీలు నెరవేరుస్తారని రామగుండం బీజేపీ ఇంచార్జీ కందుల సంధ్యారాణి ప్రశ్నించారు. 8 ఇంక్లైన్ కాలనీలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ… బీజేపీ అభ్యర్థుల గెలుపు మాత్రమే ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయగలదని స్పష్టం చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలన, యువత భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఓటు విలువైనదని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధి ఆశించే యువత, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు.బీజేపీ అభ్యర్థుల గెలుపుతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందనీ, అందరూ సంఘటితంగా ఉంటూ బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ నెల 27 వ తేదీన జరిగే ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్ నిజామాబాద్ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డినీ ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్ నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య, ముకిరి రాజు, దాసరి శ్రీనివాస్, ఆకుల కుమార్, ఐలవేణి అనిల్, లింగం నాయక్, వేణుగోపాల్ రావు, ముత్యాల బాలయ్య, బద్రి దేవేందర్, బండారి శ్యామ్ మనోహర, నాగేందర్, లక్ష్మణ్,మాదరాబోయిన రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
