గోల్డెన్ న్యూస్ /నిజామాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా ఈ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.30కు నిజామాబాద్ చేరుకొని ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సభలో ప్రసంగిస్తన్నారు.అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకునీ ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకొని అక్కడ ఏసభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలలో సీఎం, పీసీసీ అధ్యక్షులు, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు…
