గోల్డెన్ న్యూస్ / అన్నమయ్య : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన దగ్గరున్న ఆలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏనుగుల దాడిలో చనిపోయిన వారిలో ముగ్గురు భక్తులు వైకోటకు చెందిన వారుగా తెలుస్తోంది .గుండాలకోన దగ్గరున్న ఆలయానికి వైకోటకు చెందిన భక్తులు వచ్చారు. అయితే అదే సమయంలో అక్కడున్న ఏనుగులు భక్తులపై దాడి చేసాయి. ఏనుగుల బీభత్సంలో ముగ్గురు భక్తులు చనిపోయారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Post Views: 16