గోల్డెన్ న్యూస్ /పెద్దపల్లి : గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బార్ అసోసియేషన్ సభ్యులు నాంతాబాద్ కిరణ్ జీ పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ మెజారిటీ సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి న్యాయవాదులు విధులను బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్ భాస్కర్, జనరల్ సెక్రెటరీ కే. శ్రీనివాస్ తెలిపారు. తరచు న్యాయవాదుల పట్ల అనుచితంగా సిఐ మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పున్నారావృతం కాకుండా ఉండాలంటే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Post Views: 21