ఆర్.బి.ఐ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్..

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం:  ఆర్ బి ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత – మహిళా సాధికారత పై ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు వారోత్సవాలు వారోత్సవాల భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని ముఖ్యంగా మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన కలిగి ఉండడం ద్వారా త్వరితగతిన ఆర్థిక ప్రగతి సాధించవచ్చు అన్నా మహిళల కోసం ఆర్థిక ప్రణాళిక, పొదుపు, నష్ట నివారణ చర్యలు, ఆర్థిక పరిపుష్టికి రుణాలు పొందడం తదితర అంశాలపై గృహిణులు, ఉద్యోగినులు, స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు, కళాశాల విద్యార్థినులకు అన్ని బ్యాంక్ శాఖలు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు బ్యాంక్ అధికారులు విరివిగా రుణాలు ఇవ్వాలని  సూచించారు.కార్యక్రమంలో లీడ్ జిల్లా మేనేజర్ రామిరెడ్డి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram