ఓ ఆర్ఆర్ పై పోలీసు వాహనం బోల్తా.

గోల్డెన్ న్యూస్/పటాన్ చేరు : ఔటర్ రింగ్ రోడ్డుపై  ఎగ్జిట్ 3 దగ్గర పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పోలీస్ వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి.డ్యూటీలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా కారు టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్నవారంతా కూడా ఏఆర్ కానిస్టేబుల్స్. తీవ్రగాయాలైన కానిస్టేబుల్స్ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram