గ్రామానికి రోడ్డు లేకపోవడంతో డోలీ కట్టిన కుటుంబ సభ్యులు.
మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి ఆసుపత్రికి తరలింపు.
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : ఏజెన్సీలో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నట్టు పాలకులు చెబుతున్నప్పటికీ.. మారుమూల గ్రామాల ఆదివాసీలకు డోలీ మోతల ఇక్కట్లు తొలగడం లేదు. గర్భిణులు, తీవ్రఅనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోనీ ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడు కు చెందిన సుధీర్ మంగళవారం ఉదయం తీవ్ర కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందజేశారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ ను డ్రైవర్ రోడ్డు మీదే నిలిపివేశాడు. చేసేదేమీ లేక సూదిర్ ను కుటుంబం సభ్యులు డోలి కట్టుకొని మూడు కిలోమీటర్లు మేర మోసుకుంటూ వెళ్లి అంబులెన్సు ఎక్కించారు. అక్కడ మంచి కరకగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుధీర్ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు..
Post Views: 55