పాఠశాలల్లో ఇక తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి.

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని నిర్ణయించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేసేందుకు విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కోంది..

Facebook
WhatsApp
Twitter
Telegram