గోల్డెన్ న్యూస్ /వరంగల్ : తల్లిదండ్రులకు దూరంగా చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ కు చెందిన ఓ విద్యార్థిని వ్యవసాయ పరిశోదన కేంద్రం కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సి మొదటి సంవత్సరం చదువుతుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నందుకు ఒత్తిడికి గురవుతూ ఉండేది. ఆమెకు తోడుగా అప్పుడప్పుడు తల్లి కొన్ని రోజులు కళాశాల హాస్టల్ బస చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Post Views: 25