వీరికి ఎన్నికల కోడ్‌ వర్తించదా .?

గోల్డెన్ న్యూస్/ వైరా : మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మరోవైపు ఆ కోడ్ తమకు పట్టనట్లు రాజకీయ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ను అమలు చేయడంలో వైరా మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో బుధవారం నుంచి జాతర జరుగుతుంది. జాతరకు భక్తులు వెళ్లే మార్గంలో సాయిబాబా గుడి వద్ద ఉన్న క్రాస్ రోడ్డు నుంచి గండగల పాడు గ్రామం వరకు ఆర్ అండ్ బీ రోడ్డుపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలకు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ ప్లెక్సీలు చూసిన పలు పార్టీల నాయకులు అధికార పార్టీకి ఎన్నికల కోడులంగించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు  అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు చేయాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram