లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ప్రధానోపాధ్యాయుడు

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : లంచం తీసుకుంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిశా ధికారులకు పట్టుబడ్డారు . కూలిలైన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  రవీందర్ రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వ్యాయామ శిక్షణ కోసం పాఠశాల కు రూ. 30 వేలు మంజూరు చేయడం జరిగింది.ఈ మొత్తాన్ని వ్యాయామ ఇన్స్ ట్రక్టర్ అందించేందుకు హెడ్ మాస్టర్ రవీందర్ రూ. 20 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఇన్స్ ట్రక్టర్ ఏసీబీ అధికారులు ఆచరించాడు ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలో  రవీందర్ లంచం తీసుకుంటుండగా ఉపాధ్యాయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram