ఆ ఎస్టీ బాలుర వసతి గృహం సిబ్బంది అన్నదానంలో తినాలని విద్యార్థులకు హుకుం
చేసేదేమీ లేక గుడిబాట పట్టిన విద్యార్థులు
గోల్డెన్ న్యూస్ /నాగర్‌కర్నూల్: బల్మూర్ మండలం కొండనాగులలోని గిరిజన బాలుర వసతి గృహంలో బుధవారం చేసుకుంది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఘటన. గిరిజన బాలుర వసతి గృహంలో వంట చేయకుండా శివరాత్రి పండగ సందర్భంగా ఆలయాల్లో చేసే అన్నదానంతో కడుపు నింపుకోవాలని విద్యార్థులకు సిబ్బంది హుకుం జారీ చేయడంతో విద్యార్థులు ఆకలితో అలమటించిన విద్యార్థులు నాగర్‌కర్నూల్ కొండనాగులలో ఎస్టీ బాలుర వసతి గృహం ఉంది. అందులో 380 మంది విద్యార్థులు ఉంటారు. బుధవారం మహా శివరాత్రి కావడంతో 180 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. మిగతా 200 మంది వసతి గృహం లోనే ఉన్నారు. వీరి కోసం సిబ్బంది ఉదయం అల్పాహారంగా అన్నం, నీళ్లచారు వడ్డించి మమ అనిపించారు. మధ్యాహ్నం భోజనానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ శివాలయ క్షేత్రంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వెళ్లాలని, రాత్రి వీరంరాజుపల్లి రోడ్డులోని గంగమ్మ దేవాలయం వద్ద పెట్టే భోజనం తినాలని విద్యార్థులకు సుఖం జారీ చేసి వంట చేయడం మానేశారు. ఏమీచేయలేని విద్యార్థులు ఆలయాల వద్దకు వెళ్తే వారికి చేదు అనుభవమే ఎదురైంది. భక్తులు తిన్నాకే మీరు తినాలని ఆలయ నిర్వాహకులు చెప్పడంతో బాధగా ఒకవైపు కూర్చున్నారు. కొందరు అక్కడే నిల్చోని భక్తులు తినే వరకు నిరీక్షించి, తర్వాత వారు పెట్టింది తిన్నారు. అలా సగం మందికి పైగా పస్తులు ఉండాల్సి వచ్చింది. గురువారం ఉదయం పాఠశాలలో విద్యార్థులు నీరసంగా కనిపించగా ఉపాధ్యాయులు ఎందుకు ఇలా ఉన్నారని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. భోజనం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విద్యార్థులను నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడమేంటని స్థానికులు మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం జరిగినా, ఆహారం కలుషితమై అస్వస్థతకు గురైనా బాధ్యులెవరని ప్రశ్నించారు. వసతి గృహం సంక్షేమాధికారి రాములును వివరణ కోరగా, 26న తాను హాస్టల్‌కు వెళ్లలేదని, వంట చేయకుండా విద్యార్థులను ఆలయాల వద్దకు పంపిన విషయం తనకు తెలియదని చెప్పారు