గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల పరిధిలోని మోతే గ్రామం ఎర్ర చెరువు సమీపంలోని జామాయిల్ తోటకు శుక్రవారం సాయంత్రం నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెంచిన తోటకు నిప్పంటుకోవడంతో ఎంత మేరకు నష్టం జరిగిందో ? జామాయిల్ తోట ప్రధాన రహదారి వెంట ఉండటం వలన ఎవరైనా కాల్చి పారేసిన సిగరెట్ వల్ల నిప్పంటుకుందా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంటించారా అన్నది తెలియడం లేదని స్థానికులు అంటున్నారు.
Post Views: 76