గోల్డెన్ న్యూస్ / ఆత్మకుర్: అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై. తిరుపతి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మల్కాపేట గ్రామానికి చెందిన కన్నం చిరంజీవి గత కొన్ని రోజులుగా ప్రజల వద్ద తక్కువ ధరలకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు విక్రయించడానికి కోళ్ల ఫారాలకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించి 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని చిరంజీవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు..
Post Views: 37