గోల్డెన్ న్యూస్/ భిక్కనూరు : భిక్కనూరు మండలంలోనిబి సిద్ధ రామేశ్వరం నగర్ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రాత్రి బస చేశారు. విద్యార్థులకు భోజన వసతి సదుపాయాలు, విద్య బోధన, రోజువారి దినచర్య, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ లో ఉన్న విద్యార్థుల తరగతి గదికి కలెక్టర్ వారితో భేటీ అయి 10వ తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వంటశాల, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన వంట సరుకులను నాణ్యత పరిమాణాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేసి విద్యార్థులతో పాఠశాల గదిలో నిద్రించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.
Post Views: 50