ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ పై పెట్రోల్ పోసి నిప్పుంటించిన గుర్తుతెలియని వ్యక్తి .
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సూపర్డెంట్ విభాగంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గదిలో ఎలాంటి సామాగ్రి లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు . బుధవారం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.
Post Views: 43