కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల పరిధిలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి చెందిన సోడి మాసయ్య (35) మృతి. కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై అనారోగ్యంతో శనివారం ఇంటి వద్ద మృతి చెందాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా. ఎస్ఐ రాజేందర్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి బాబాయ్ సోడి మడకం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షకు తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram