గోల్డెన్ న్యూస్/ పాలవంచ : ఓవైపు పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల హడావుడి.. ఇంకోవైపు ఆహ్వాన పత్రికల పంపిణీతో అందరూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంతలోనే ఆ కుటుంబంపై కోలుకోలేని దెబ్బ పడింది. నాలుగు రోజుల్లో కన్యాదానం చేయాల్సిన వధువు తండ్రిని గుండెపోటు రూపంలో మృత్యు కబాలించింది .నాలుగు రోజుల్లో కన్యాదానం చేయాల్సిన వధువు తండ్రిన కన్నుమూశారు. ఈ విషాద ఘటన పాల్వంచ మండలంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. మొండికట్టకు చెందిన చిల్లా వెంకన్న (50), భార్య పూలమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్దమ్మాయి బీటెక్ చదివారు. జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 12న వివాహం నిశ్చయమైంది. వారింట పెళ్లి పనుల వేడుకుల సందడి నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక వెంకన్నకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే ప్రాణాలొదిలారు. శనివారం శనివారం జరిపించారు. పెద్దదిక్కు మరణంతో పెళ్లి వాయిదాపడింది.
